ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేలా చూసుకోవడం మన కర్తవ్యం మని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు.

On
ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేలా చూసుకోవడం మన కర్తవ్యం మని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు.

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెహ్రూ యువ కేంద్ర, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ట్రాఫిక్ పోలీసుల

ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ..ఆధునిక ప్రపంచంలో రవాణా, రోడ్డు ప్రతి మనిషికి నిత్యావసరాలుగా మారాయని, ఒక్కొక్కరు ఒక్కో విధంగా రోడ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రస్తుత రవాణా వ్యవస్థ ప్రయాణ సమయాన్ని తగ్గించినప్పటికీ, ఇది మానవ జీవితానికి ప్రమాదాన్ని కూడా పెంచిందన్నారు. ప్రతి సంవత్సరం, ట్రాఫిక్ ప్రమాదాలు వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయని, కోట్లాది మంది ప్రజలను తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయని పెర్కొన్నారు. ప్రతి సంవత్సరం 1,50,000 మందికి పైగా ట్రాఫిక్ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెపుతున్నాయని అన్నారు.  రోడ్డు భద్రతా విధానాలను పాటిస్తే ట్రాఫిక్ ప్రమాదాలను గణనీయంగా  అరికట్టవచ్చని అన్నారు. భారతదేశంలో 72 శాతం ట్రాఫిక్ ప్రమాదాలు అతివేగం కారణంగా సంభవించాయి. రోడ్డుకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ వాడడం వంటివి చాలా సాధారణ కారణాలని అన్నారు.  కారు ప్రమాదాల బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఇద్దరు 18 మరియు 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వున్నారని తెలిపారు. 

డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానం కలిగించే ప్రధాన వనరులలో ఒకటి సెల్ ఫోన్‌లు. మోటారు వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడం చాలా ప్రమాదకరం అన్నారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, ర్యాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్,  కారు డ్రైవర్ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ఉపయోగించాలి. అదేవిధంగ సైక్లిస్ట్ హెల్మెట్ ధరించాలని అన్నారు.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

కార్యక్రమంలో  ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు, ఆర్ ఐ సాంబశివరావు, నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్, ఎన్ ఎస్ ఎస్ పీఓలు రామకుమార స్వామి, శ్యామలదేవి, షారుఖ్ ఇమ్రాన్ ( పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ), సునంద లెక్చరర్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, ఆటో డ్రైవర్లు  పాల్గొన్నారు.

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్