"న్యూస్ ఇండియా పత్రిక కథనానికి స్పందన" ...!

యూరియా కొరత పై ప్రచురితమైన వార్తకు వ్యవసాయ అధికారి స్పందనకు వందనం...

On

న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడుబూరు మండలం జనవరి 27 :- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలోని రైతన్నలకు వ్యవసాయ పంటలు పండించేందుకు గత కొన్ని రోజులుగా సక్రమంగా యూరియా అందక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో , అటు రైతు సేవా కేంద్రాల్లో మరియు ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటిలోనూ యూరియా బస్తాలు దొరకక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గ్రహించిన న్యూస్ ఇండియా తెలుగు దిన పత్రిక ప్రతినిధి మండలంలో యూరియా కొరతతో తీవ్ర ఆవేదనకు గురైనా రైతులను కలిసి విచారించగా పత్రిక ప్రతినిధితో పలువురు రైతులు మాట్లాడుతూ ఈ రభి సీజన్ లో నీటి సౌకర్యం ఉన్న చోట వరి పంటతో పాటు వివిధ రకాల పంటలు పండించడం జరుగుతుందన్నారు. అలాగే మిరప పంట చివరి దశలో ఉందని ఇప్పుడు చిగురు కాపు కోసం సాగు చేసే రైతులకు యూరియా ప్రధానంగా అవసరం అవుతుందన్నారు. ఇప్పుడు పండిస్తున్న పంటలకు యూరియా కాకుండా ఇతర ఎరువు బస్తాలు కొనాలంటే రేట్లు అధికంగా ఉన్నాయని, ఒకవేల పండించిన పంటలకు మాత్రం రేట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయనీ, కాబట్టి పంటలకు అధిక పెట్టుబడులు పెట్టాలంటే రైతులకు ఒనుక్కు పుడుతుందని అన్నారు. కావున తక్కువ ధరలో దొరికే యూరియా కోసం చాలా రోజులుగా నానా అవస్థలు పాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వెళ్లడించారు. యూరియా కోసం చుట్టు ప్రక్కల ఉన్న పట్టణాల సైతం వెళ్లి, ప్రయివేటు దుకాణాలలో యూరియా బస్తా కావాలంటే లింక్ పై ఇతర ఎరువు బస్తాలు తీసుకోవాలని,అలాగే ప్రతి బస్తాపై 20రుపాయలు అదనంగా డబ్బులు ఇస్తే తప్ప యూరియా దొరికడం కష్టంగా ఉండేదన్నారు.  ఇలా అనవసరంగా అధికమైనా రేట్లతో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తే రైతులు అప్పుల పాలు కావడం తద్యమని పలువురు రైతులు పత్రిక మూలాన వారి ఆవేదనను చెప్పుకోచ్చారు. ఈ విషయంపై శనివారం న్యూస్ ఇండియా ప్రతినిధి పత్రికలో రైతుల సమస్యలు తీర్చండి అంటూ వార్త శీర్షికను ప్రచురితం చేయడం జరిగింది. అయితే ప్రచురితమైన ఈ వార్తకు స్పందించిన పెద్దకడుబూరు మండలంలోని వ్యవసాయ అధికారి స్పందనకు వందనం...పత్రిక ద్వారా రైతుల ఆవేదనను తెలుసుకొని ప్రస్తుతం స్థానిక రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాలు నిలువ చేయించడం జరిగింది. కాబట్టి యూరియా కావలసిన రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్లి యూరియా బస్తాలు కొనుగోలు చేయగలరు...13_MTK_1_copy_44e59e8362

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...