9 మంది పేకటరాయుళ్లు అరెస్ట్...

చెడు అలవాట్లకు అలవాటు పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

On
9 మంది పేకటరాయుళ్లు అరెస్ట్...

9 మంది పేకాటరాయిలు అరెస్ట్..

రంగారెడ్డి జిల్లా, జనవరి 29, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ఓ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న పేకాట స్థావరంపై ఎస్ఓటి బృందం దాడులు నిర్వహించి, 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో 9 మంది కలిసి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మహేశ్వరం ఎస్ఓటి బృందం, స్థానిక పోలీసులతో దాడులు నిర్వహించారు. ఇందులో పట్టుబడిన 9 మంది వ్యక్తులు అదుపులోకి తీసుకొని విచారించి అనంతరం తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి వద్ద నుండి రూ.71,990/- నగదు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎండి సుల్తాన్ (ఇబ్రహీంపట్నం), జుట్టు శ్రీశైలం (యాచారం), కటికిరెడ్డి బాల్ రెడ్డి (నాదర్గుల్), రాసురి కృష్ణ (రాయిపోల్), కోడి యాదగిరి (ఇబ్రహీంపట్నం), ఆకుల సురేష్ (ఇబ్రహింపట్నం) శ్రీనివాస్ (ఇబ్రహింపట్నం), వాసం రామ్ లక్ష్మణ్ (ఇబ్రహింపట్నం), బర్ల కుమార్ (ఇబ్రహింపట్నం) గా పోలీసులు గుర్తించారు. పేకాటరాయుల నుండి 71 వేల నగదు, 9 ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రికి రాత్రే స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు సమాచారం. చెడు అలవాట్లకు అలవాటు పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

IMG-20250129-WA0315
9 మంది పేకాటరాయిలు అరెస్ట్..
Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...