శివశక్తుల గిరిజన పూజారుల గురించి రాష్ట్రపతి లేఖ

మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ధన్యవాదాలు

On
శివశక్తుల గిరిజన పూజారుల గురించి రాష్ట్రపతి లేఖ

కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో) డిసెంబర్ 15:విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో హిందూ సంస్కృతిని మరియు గుడులను కాపాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శివ శక్తుల గిరిజన పూజారులకు దీప దూప నైవేద్యం పథకం ద్వారా 10,000/- రూపాయల నెలసరి వేతనాన్ని అందించాలి అని, గుడులకు నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, జాతీయ ఎస్టీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కి లేఖలు రాసిన స్పందించడం లేదని,భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నవంబర్ 12వ తేదీన లేఖ రాయడం జరిగింది. కేవలం పది రోజుల్లో స్పందించిన రాష్ట్రపతి నవంబర్ 22నాడు ఎండోమెంట్ సెక్రటరీ రెవెన్యూకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ విషయంలో సహకరించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ భారత ప్రభుత్వ సలహాదారు, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ రామ్ కుమార్ వాలియా, విశ్వహిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్ మహంత్ ముకేష్ నాథ్, లక్ష్మి ఠాకూర్, మహివీర్ కొరవి, రమేష్ ఖేతన్ కి విశ్వహిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ మరియు కోఆర్డినేటర్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News