టి.యు. సి.ఐ ఐదవ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
రాష్ట్ర అధ్యక్షులు డి.రాజేష్ పిలుపు
టి యు సి ఐ కమిటీ సభ్యులు
05/11/2024 గురువారం రోజున జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఈనెల 13.14.15 తేదీలలో హైదరాబాద్ లోని ఓంకార్ భవన్ లో జరిగే జాతీయ మహాసభల కరపత్రoను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టి.యు.సి. ఐ రాష్ట్ర అధ్యక్షులు డి.రాజేష్ మాట్లాడుతూ భారతదేశంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల వంటి క్రూరమైన కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి యావత్ కార్మికుల కడుపు కొట్టిందని అన్నారు. దేశంలోని కార్మిక వర్గం అప్రమత్తమై మతోన్మాద బిజెపి ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటంలో భాగస్వాములమై కార్మిక లోక సమస్యల పరిష్కారానికై ఈనెల హైదరాబాదులో జరగబోయే ఐదవ జాతీయ మహాసభలకు కార్మిక లోకం కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి కాశీం, ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధమల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మాన్యపు భుజేoధర్, కే ఏడుకొండలు, గుండెల రాయుడు, జి కొమురయ్య, బి రాజు, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.
Comment List