దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చిన మద్దిశెట్టి

విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో వినతి

On
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చిన మద్దిశెట్టి

కొత్తగూడెం (న్యూస్ఇండియా బ్యూరో నరేష్)డిసెంబర్ 4: హైదరాబాదులోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సహాయా కమిషనర్ కృష్ణవేణినికి విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మద్దిశెట్టి  సామేలు  బుధవారం కలిసి నాలుగు జిల్లాలలోని గిరిజన శివ శక్తుల పూజారులకి సంబంధించి నెలసరి జీతాలు, గుడులకి మౌలిక వసతులు విషయంలో గౌరవ భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎండోమెంట్ శాఖ కి ఇచ్చిన ఆదేశాలను అమలు పరచాలని 1,850 మంది జాబితాను విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖకి వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య, బానోత్ రవి నాయక్, ముక్తి మల్లేష్, పుట్టబంతి హరిబాబు, పలగాని శ్రీనివాసరావు గౌడ్, ఎండీ రంజాన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News