కార్మిక హక్కులను కాలరాస్తున్న
పాసిస్ట్ మోడీ ప్రభుత్వం
మాన్యపు బుజేందర్
హైదరాబాదులోజరుగుతున్న టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా కిసాన్ సంఘటన్ ప్రధాన కార్యదర్శి మాన్యపు బుజేందర్ పాల్గొని వక్త గా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పాసిస్ట్ విధానాలతో కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికుల పొట్ట కొడుతుందని విమర్శించారు. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మతోన్మాద ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఉందనిఅన్నారు. టి యు సి ఐ కి తోడుగా ఏఐకేఎస్ కలిసి పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ జాతీయ మహాసభలలో టి యు సి ఐ కేంద్ర కమిటీ అధ్యక్షులు
కామ్రేడ్ అయ్యప్ప హుగర్,అధ్యక్షత వహించగా! చార్లెస్ జార్జి టి యు సి ఐ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, చంద్రకుమార్ మాజీ హైకోర్టు జడ్జి, నల్ల సూర్య ప్రకాష్ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, ఫ్రెడి కె థాజత్, తుడుం అనిల్ కుమార్, మారీదు ప్రసాద్ బాబు, టి యు సి ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డి రాజేష్, ప్రధాన కార్యదర్శివేమూరి భాస్కర్, సుధమల్ల భాస్కర్ ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కార్మికులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.
Comment List