వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
ఘనంగా ఆహ్వానించిన ఎస్పీ మరియు అధికారులు
*ఎస్పీ గా పాదోన్నతి పొందిన అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య గారిని ఘనంగా ఆహ్వానం పలికిన ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు జిల్లా పోలీస్ అధికారులు.*
మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ గా జనవరి 2వ తేదీ ,2022 లొ విధులలొ చేరి రెండు సంవత్సరాలు జిల్లా లొ సేవలు అందించినరు.
ఇప్పుడు ఎస్పీ గా పాదోన్నతి పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS అన్నారు.
ఈ సందర్భంగా ఆయనను జిల్లా పోలీస్ కార్యాలయం గేట్ వద్ద నుండి ఎస్పీ గారు ఛాంబర్ వరకు బ్యాండ్ మేళలతో ఊరేగింపు గా ఘనంగా ఆహ్వానం పలికారు.
అనంతరం. ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారిని మరియు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.
ఈ నెల 31 వ తేదీన రిటైర్మెంట్ ఉండగా ఎస్పీ గా పాదోన్నది పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎస్పీ జోగుల చెన్నయ్య గారు ఆనందం వ్యక్తం చేసారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ IPS గారికి మరియు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారికి కృతజ్ఞతలు తెలిపారు.
PRO to SP మహబూబాబాద్
Comment List