గ్రూప్‌ 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి

ఎస్పి రోహిత్‌ రాజును తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది

On
గ్రూప్‌ 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి

కొత్తగూడెంIMG-20241215-WA1034(న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 15 : జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల నందు నేడు గ్రూప్‌ 2 పరీక్షల జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. గ్రూప్‌ 2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలలో 13466 మంది అభ్యర్థులకుగాను 6324 మంది పరీక్షకు హాజరు హాజరయ్యారని, 7142 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వివరాలు వెల్లడిరచారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్‌ఎస్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమల్లో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు అనుమతులు లేవని ప్రజలు గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. జవాబు పత్రాలు తరలింపులోను ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నడుమ తరలింపు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉమెన్స్‌ మహిళా కళాశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ఎస్పి రోహిత్‌ రజు పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించే ముందు ఎస్పి స్వయంగా భద్రతా సిబ్బందితో తనను తనిఖీ చేయించుకోడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పరీక్షా కేంద్రాల వద్ద భద్రాతా ఏర్పాట్లు ఎంత పకడ్బందిగా ఉన్నాయో అర్థమవుతోంది.

Views: 90
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News