అటో డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు
డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
పాల్గొన్న సీఐలు శివప్రసాద్ ,కరుణాకర్ ,ట్రాఫిక్ ఎస్సై నరేష్ ,వన్ టౌన్ ఎస్ఐ విజయ
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ మంగళవారం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక ఆటోకు తప్పనిసరిగా టాప్ నెంబర్ ఉండాలని అన్నారు. టాప్ నెంబర్ లేని వారు దరఖాస్తును స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా ఆటో అడ్డాలో ఇవ్వాలని కోరారు. మత్తు, మాదక ద్రవ్యాలకు, దురు వ్యసనాలకు అలవాటు కాకుండా కుటుంబాన్ని కాపాడుకోవాలని, మద్యం మత్తులో ఆటో నడిపి ప్రమాదాల బారిన పడొద్దని, దానివల్ల ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఖాకి చొక్కాలను డీఎస్పీ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కరుణాకర్, శివ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై నరేష్, వన్ టౌన్ ఎస్సై విజయ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List