టి.యు. సి.ఐ ఐదవ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

రాష్ట్ర అధ్యక్షులు డి.రాజేష్ పిలుపు

By Venkat
On
టి.యు. సి.ఐ ఐదవ  జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

టి యు సి ఐ కమిటీ సభ్యులు

05/11/2024 గురువారం రోజున జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఈనెల 13.14.15 తేదీలలో హైదరాబాద్ లోని ఓంకార్ భవన్ లో జరిగే జాతీయ మహాసభల కరపత్రoను ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా టి.యు.సి. ఐ రాష్ట్ర అధ్యక్షులు డి.రాజేష్ మాట్లాడుతూ భారతదేశంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల వంటి క్రూరమైన కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి యావత్ కార్మికుల కడుపు కొట్టిందని అన్నారు. దేశంలోని కార్మిక వర్గం అప్రమత్తమై మతోన్మాద బిజెపి ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటంలో భాగస్వాములమై కార్మిక లోక సమస్యల పరిష్కారానికై ఈనెల హైదరాబాదులో జరగబోయే ఐదవ జాతీయ మహాసభలకు కార్మిక లోకం కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి కాశీం, ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధమల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మాన్యపు భుజేoధర్, కే ఏడుకొండలు, గుండెల రాయుడు, జి కొమురయ్య, బి రాజు, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.IMG-20241205-WA0304

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!