ఉన్నతి కోసం యువత శ్రమించాలి...
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్...
ఉన్నతి కోసం యువత శ్రమించాలి...
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత
మాచన రఘునందన్...
ఎల్బీనగర్, డిసెంబర్ 27 (
న్యూస్ ఇండియా ప్రతినిధి): జన్మ నిచ్చిన తల్లి దండ్రుల తో పాటు, ప్రతి ఒక్కరూ గర్వ పడేలా..ఉన్నత స్థాయికి చేరుకోవడానికి యువత శ్రమించాల్సిన అవసరం ఉన్నదని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.శుక్రవారం నాడు తన జన్మ దినోత్సవం సందర్భంగా రఘునందన్ తన మాతృమూర్తి విజయ ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..విద్యార్ధి దశ నుంచే ఉన్నత లక్ష్యం తో ఉంటే..ఆ దిశ గా నే యువత భవిత కూడా దిశా నిర్దేశం చేస్తుందన్నారు. గ్రూప్స్, సివిల్స్ లక్ష్యం గా ఉన్న వారు తమ స్నేహితులకు ప్రేరణ కలిగించే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.ప్రైవేటు ఐనా ప్రభుత్వ రంగం ఐనా ఆయా వ్యక్తులు తమ తమ కార్యదక్షత , నిబద్దత ల తో నే అగ్రగాములు అవుతారని మాచన రఘునందన్ స్పష్టం చేశారు. దురలవాట్లకు గురయ్యే బదులు మంచి ఆలోచన కు తావిచ్చేలా సజ్జన సాంగత్యం కలిగి ఉండాలని "మాచన" సూచించారు. చక్కటి ప్రణాళిక,క్రమ శిక్షణ,ఓరిమి తో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా చాటాలన్నారు.
Comment List