ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ సుంకర శ్రీనివాసుని విధుల నుండి తొలగించాలి
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ ఆధ్వర్యంలో జిఎంకు వినతి
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 28:సింగరేణి సంస్థను,సింగరేణి అధికారులను, కుల సంఘాలను అభాసపాలు చేస్తున్నటువంటి సస్పెండ్ అయిన ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ సుంకర శ్రీనివాసను విధుల నుండి తొలగించాలి దళిత,గిరిజన సంఘాల డిమాండ్ చేస్తూ సస్పెన్షన్ లో ఉన్న కొత్తగూడెం సింగరేణి ఏరియా ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ సుంకర శ్రీనివాసును విధుల నుండి తొలగించాలని కొత్తగూడెం ఏరియా జిఎం శాలెం రాజుకి దళిత, గిరిజన సంఘాల తరఫున మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎంకి ,పూల రవీందర్ విషయం వివరిస్తూ ఈ మధ్యకాలంలో దళిత గిరిజన సెక్యూరిటీ గార్డుల పట్ల ఆమానుషంగా కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాడని నేపంతో సస్పెన్షన్ కి గురైనటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ సుంకర శ్రీనివాస్ తన స్నేహితుల మీడియా పత్రికలలో కావాలని సింగరేణి సంస్థను, సింగరేణి అధికారులను, కుల సంఘాలను అభాసపాలు చేయాలని ఆలోచనతో అతను తప్పు చేసి సస్పెండ్ అయినప్పటికీ అతనిలో పరివర్తన లేకుండా కుల సంఘాలు చేయబట్టి అతను సస్పెండ్ అయ్యాడని మనసులో కసి పెంచుకొని కావాలని కుల సంఘాలకు సింగరేణిలో ఏం పని అని దళిత, గిరిజన కుల సంఘాలను కించపరిచే విధంగా, అవమానించే విధంగా కుల సంఘాల వారు దందాకారులు, దళారులు అని సింగరేణి అధికారులు దళారులకు వత్తాసు పలుకుతున్నారని, అటు దళిత, గిరిజన సంఘాలను కించపరుస్తూ అవమాన పడే విధంగా సింగరేణి, సింగరేణి అధికారులను ఆబాసపాలు చేసే విధంగా పత్రికలలో సోషల్ మీడియాలో రాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలియజేస్తూ అతనిని తక్షణమే విధుల నుండి తొలగించాలని లేని పక్షంలో దళిత,గిరిజనులు అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించరు .ఈ కార్యక్రమంలో గుమ్మడి. సాగర్, రాచపల్లి. రాజేంద్రప్రసాద్, ప్రసాద్, శివ, విజయ్ తదితర దళిత గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comment List