పండుగల పూట పస్తులుంచమాకండి సారూ...!!

జిల్లాలో 104 ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు

On
పండుగల పూట పస్తులుంచమాకండి సారూ...!!

ఆరు నెలలుగా జీతాలు రాక అవస్థలు

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) డిసెంబర్‌28:పండుగల పూట పస్తులు ఉంచకుండా మా గోడు పట్టించుకోవాలని, ఆరు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నామని, జిల్లాలో ఉన్న 60 మంది 104 ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వ ఉద్యోగులుగా అర్హత ఉన్నా ప్రభుత్వాలు కనికరించడం లేదని, మా ఆవేదన ఆలకించి సకాలంలో జీతాలు చెల్లించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ కార్యవర్గ సభ్యులు సిద్ధారావు ప్రభుత్వాన్ని కోరారు. పెండిరగ్‌లో ఉన్న ఆరు నెలల జీతాలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు నల్లబాడ్జీలతో నిరసన తెలియజేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 104 ఉద్యోగులు సైతం తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కార్యవర్గ సభ్యులు సిద్ధారావు మాట్లాడుతూ.. జిల్లాలో 104 ఉద్యోగులు డ్రైవర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సెక్యురిటీ గార్డ్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫార్మసిస్టులు కలిసి 60 మంది వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, 2024 జూలై నుంచి నేటి వరకు ఆరు మాసాలుగా వేతనాలు బకాయిలు ఉండడం వల్ల 104 ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో డిసెంబర్‌ 4వ తేదీన జీవోఆర్టీ నెంబర్‌ 706 విడుదల చేస్తూ 12 కోట్ల 56 లక్షల రూపాయలు విడుదల చేసిందని, కానీ నేటి వరకు 104 ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదన్నారు. ఏజెన్సీల ద్వారా తమ వేతనాలు చెల్లించడం మూలంగా తమకు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీనివల్ల 104 ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 104 ఉద్యోగులను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో ఉన్న కాలేజీలో ఇన్‌స్టిట్యూట్‌లోకి సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా నేటి వరకు రాలేదని, దీనివల్ల ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. డిఎంఈ పరిధిలోని కాలేజీలో హాస్పిటల్స్‌లో సొంత జిల్లాల పరిధిలోకి 104 ఉద్యోగులందరినీ బదిలీలు చేయాలని కోరారు. 104 ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా జీతాలు చెల్లించడం రద్దు చేయాలని, ట్రెజరరీ ద్వారా ప్రతి నెలా ఒకటో తారీఖున చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో యారో ఏజెన్సీ ద్వారా తమకు జీతాలు చెల్లిస్తున్నారని, తమ జీతాల్లో నుంచి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ కట్‌ చేస్తున్నారని, కానీ 8 నెలలుగా ప్రభుత్వానికి చెల్లించకుండా కాలయాపన చేస్తోందని, దీని మూలంగా తాము ఎంతగానో నష్టపోతున్నామని, దీనిపై త్వరలోనే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Views: 134
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List