జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వదిలిపెట్టేది లేదు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TUWJ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

On

హాజరైన టీయూడబ్ల్యూజే (టిజేఎఫ్‌) హెచ్‌`143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ

IMG-20241230-WA0806IMG-20241230-WA0786కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )డిసెంబర్ 30:తెలంగాణకై కొట్లాడిరది టియూడబ్ల్యూజే మాత్రమేనని, జర్నలిస్టులకు ప్రత్యేక నిధిని సాధించింది కూడా మన సంఘమేనని, రికార్డు స్థాయిలో 20,300పై చిలుకు అక్రిడేషన్లు అందజేసిన ఘనత కూడా మనకు దక్కుతుందని, కరోనా సమయంలో రూ.7కోట్ల ఆర్థిక సాయం అందజేయడమే కాకుండా రాష్ట్రంలో దాదాపు 450 జర్నలిస్టుల కుటుంబాల్లో పింఛన్‌ అందజేసి వెలుగులు నింపామని టియూడబ్ల్యూజే(టిజేఎఫ్‌) హెచ్‌`143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. స్వరాష్ట్రానికై ఆంధ్రా యజమానుల చేతుల్లో నుంచి పెద్ద పదవులను సైతం కాదని బయటి వచ్చి పోరాటం చేశామని, ఆంధ్రా పెత్తందారీ యూనియన్లతో ఒరిగేదేమీ లేదని, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వదిలిపెట్టేది లేదని, సభ్యత్వ నమోదు చేసుకోండి... మేమంతా మీతోనే ఉంటామని అల్లం నాయరణ భరోసా నిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టియూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమం టియూడబ్ల్యూజే(టిజేఎఫ్‌) హెచ్‌`143 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్‌ షఫీ సమక్షంలో సోమవారం కొత్తగూడెంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అల్లం నారాయణ మాట్లాడుతూ.. 15 ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో టియూడబ్ల్యూజే పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పాస్‌ చేయాలనుకున్నప్పుడు టియూడబ్ల్యూజే ప్రధాన భూమిక పోషించిందన్నారు. ఆంధ్ర పెత్తందారీ యూనియన్లతో ఒరిగేదేమీ లేదని, తెలంగాణ కోసం కొట్లాడిరది.. పోరాడిరది మన సంఘమేనన్నారు. జర్నలిస్టులకు రూ.42కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతో పాటుగా కరోనా లాంటి విపత్కర సమయాల్లో రూ.10వేలు, రూ.20వేలు చొప్పున రూ.7కోట్ల ఆర్థిక సాయం కేవలం ఆధార్‌ కార్డు ద్వారా అందజేశామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 450 కుటుంబాలకు పింఛన్‌ అందజేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. రాష్ట్రంలో 20,300కు పైగా అక్రిడిటేషన్‌ కార్డులతో పాటు డెస్క్‌ జర్నలిస్టులకు సైతం అందజేసిన ఘనత కూడా మన సంఘానికే దక్కుతుందన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అక్రిడిటేషన్‌ కార్డుల సంఖ్య తగ్గించడంతో పాటుగా, డెస్క్‌ జర్నలిస్టులను సైతం తొలగించేందుకు  కుట్ర జరుగుతోందన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంబంధించి ప్రత్యేక జీవో సైతం వచ్చిందని, కానీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆగిపోయాయని, ఇండ్ల స్థలాల సమస్యను వదిలిపెట్టేది లేదని, యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టియూడబ్ల్యూజే సభ్యత్వ నమోదులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, మన యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని, తామంతా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్‌ హజరే, రాష్ట్ర కోశాధికారి యోగానంద్‌, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు విష్ణు, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కాగితపు వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి, ఐజేయూ సభ్యులు చండ్ర నరసింహారావు, గుర్రం రాజేష్‌, టెంజూ జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, జిల్లా కార్యదర్శి శ్రీహరి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Views: 55
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వ దవఖానాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా శాస్త్ర చికిత్సలు ప్రభుత్వ దవఖానాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా శాస్త్ర చికిత్సలు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: కొత్తగూడెం ప్రభుత్వ దావఖానాలొ ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యులు వైద్యాన్ని అందిస్తూ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు . కొత్తగూడెం గొల్లగూడేనికి...
ప్రమాదవశాత్తు లారీ దగ్ధం 
వైసీపీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
సాయుధ పోరాట యోధురాలు కమలాదేవి
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..
నూతన సంవత్సర సందర్భంగా సోనూసూద్ ఫ్యాన్స్  కేక్ కటింగ్ 
అనాధలకు అండగా