ప్రభుత్వ దవఖానాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా శాస్త్ర చికిత్సలు
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి పై భరోసా కల్పిస్తున్న వైద్యులు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: కొత్తగూడెం ప్రభుత్వ దావఖానాలొ ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యులు వైద్యాన్ని అందిస్తూ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు . కొత్తగూడెం గొల్లగూడేనికి చెందిన 41 సంవత్సరాలు వయసు గల మహిళకు కుడిచెవి నొప్పితో బాధపడుతూ జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ వైద్యులను సంప్రదించగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించి, సిఎస్ఓఎమ్ అనే వ్యాధిగా గుర్తించారు. మరుసటి రోజు రెండో తేదీన నేడు మాస్తోడెక్టమి , టైమ్యాప్నొప్లాస్టీ అనే ఆపరేషన్ నిర్వహించి, శాస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ సందీప్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ హేమంత్ సీనియర్ రెసిడెంట్, డాక్టర్ నమ్రత ట్యూటర్, అనిస్తిస్య వైద్యులు అనుస్తిస్య అనేస్టేసియా వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, రమేష్, స్టాప్ నర్సింగ్ ఆఫీసర్స్ దుర్గ, సాయి, ఓటి అసిస్టెంట్ పవన్,కోటి ,అనిల్ పాల్గొన్నారు.
Comment List