పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..
మాచన రఘునందన్..
2025 లో జయం మనదే
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత
మాచన రఘునందన్..
ఎల్బీనగర్, జనవరి 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): యువత లో శక్తి,యుక్తి మెండుగా ఉన్నాయని, వాటిని చక్కటి ప్రణాళిక ప్రకారం అమలు చేస్తే అద్భుతాలు జరుగుతాయని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ స్పష్టం చేశారు.2025 ఆరంభం సందర్భంగా.."మాచన" మాట్లాడుతూ.. 2025 ను అద్భుతవత్సరం గా మలుచుకునే ఆలోచన యువత లో ఉండాలని రఘునందన్ సూచించారు.సాధన చేస్తే సాధించ లేనిది ఏదీ లేదన్నారు. దృడ సంకల్పం మనదే ఐతే అద్భుత విజయం కూడా మనదే అని చాటి చెప్పాలన్నారు.గ్రూప్స్, సివిల్స్, ఇలా ఏ పోటీ పరీక్ష లో ఐనా అసాధారణమైన తపన తో అగ్రగాములుగా నిలిచి తానేంటో, తామేమిటో నిరూపించుకోవాలని మాచన రఘునందన్ అభిలషించారు.విద్యార్దులకు, యువత 2025 నభూతో న భవిష్యతి అన్న రీతిలో ఉండేలా చక్కటి కార్యాచరణ ప్రణాళిక
తో కృషి చెయ్యాలన్నారు.
Comment List