ఇద్దరిని వరించిన పదవులు

రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి

On
ఇద్దరిని వరించిన పదవులు

టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు,

కొత్తగూడెం ( న్యూస్ ఇండియా నరేష్ ) జనవరి 5:టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి నియమించబడ్డారు. ఈ సందర్బంగా కొత్తగూడెం పొంగులేటి క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న మాట్లాడుతూ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేసిన వారికే పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. కష్టపడి పని చేసే వారికి భవిష్యత్‌లో కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి తమపై నమ్మకం ఉంచి అడ్వైజరి బోర్డు సభ్యులుగా తమను నామినేట్ చేసిన ఖమ్మం ఎంపీ రాం సహాయం రఘురాం రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు ఆళ్ళ మురళి తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులు బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ సభ్యులు బాదర్ల జోషి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా తమ సేవలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, నాగేంద్ర త్రివేది, పెదబాబు, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంత్ రావు, కౌన్సిలర్ రైల్వే బోర్డు సభ్యులు వై శ్రీనివాస్ రెడ్డి, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, పాల్వంచ మండల అధ్యక్షులు కొండ వెంకన్న, పూనెం శ్రీను, పోస్ట్ ఆఫీస్ వాసు, కేకే శ్రీను, మాసూద్, బాలపాసి, విప్లవరెడ్డి, పాల సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Views: 119
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News