ఇద్దరిని వరించిన పదవులు

రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి

On
ఇద్దరిని వరించిన పదవులు

టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు,

కొత్తగూడెం ( న్యూస్ ఇండియా నరేష్ ) జనవరి 5:టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి నియమించబడ్డారు. ఈ సందర్బంగా కొత్తగూడెం పొంగులేటి క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న మాట్లాడుతూ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేసిన వారికే పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. కష్టపడి పని చేసే వారికి భవిష్యత్‌లో కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి తమపై నమ్మకం ఉంచి అడ్వైజరి బోర్డు సభ్యులుగా తమను నామినేట్ చేసిన ఖమ్మం ఎంపీ రాం సహాయం రఘురాం రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు ఆళ్ళ మురళి తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులు బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ సభ్యులు బాదర్ల జోషి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా తమ సేవలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, నాగేంద్ర త్రివేది, పెదబాబు, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంత్ రావు, కౌన్సిలర్ రైల్వే బోర్డు సభ్యులు వై శ్రీనివాస్ రెడ్డి, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, పాల్వంచ మండల అధ్యక్షులు కొండ వెంకన్న, పూనెం శ్రీను, పోస్ట్ ఆఫీస్ వాసు, కేకే శ్రీను, మాసూద్, బాలపాసి, విప్లవరెడ్డి, పాల సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Views: 123
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్
కొత్తగూడెం(న్యూస్ఇండియా నరేష్)జనవరి 8:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ సూచనలతో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు...
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం
ఏసీబీ వలలో ఓ పోలీసు అధికారి.........?