ఏసిబి వలో ఓ పోలీస్ అధికారి.........?
• పిడిఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్ • కొంత డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు • సోదాలు జరుపుతున్న ఏసీబీ అధికారులు • తొర్రూరులో కొనసాగుతున్న విచారణ
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఆదిలాబాద్ కు చెందిన ఓ నిందితుడి నుంచి పోలీసు అధికారి రూ.4లక్షలు డిమాండ్ చేసి రూ. 2 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
పీడీఎస్ రైస్ బిజినెస్ చేసే ఓ వ్యాపారిని రూ.ఐదు లక్షలు డిమాండ్ చేసి రూ.రెండు లక్షలు తీసుకున్నారనే ఆరోపణలపై సదరు ప దీనిపై ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించింది.
Comment List