నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్
కొత్తగూడెం(న్యూస్ఇండియా నరేష్)జనవరి 8:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ సూచనలతో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు బుధవారం నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.కొత్తగూడెం పట్టణంలోని ప్రదాన కూడళ్ల వద్ద నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను ఆపి వారికి కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారుగా నంబర్ ప్లేట్లు లేని 40 వాహనాలను ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి జరిమానా విధించడం జరిగిందని ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ తెలిపారు.రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పోలీసులు చేపట్టే కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.చైన్ స్నాచింగ్ మరియు దొంగతనాలకు పాల్పడే నేరస్తులు ఎక్కువగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను వినియోగిస్తున్నారని, అట్టి నేరాలను అదుపు చేయడం కోసమే నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ ఎస్ఐలు నరేష్,మదార్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List