కొత్తగూడెం చేరుకున్న మాలల మహాపాదయాత్ర

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలి

On
కొత్తగూడెం చేరుకున్న మాలల మహాపాదయాత్ర

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ..దళితుల ఐక్యత కోసం పాదయాత్ర రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్

(న్యూస్ఇండియా నరేష్) అక్టోబర్ 27: భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు కొనసాగుతున్న మాలల మహా పాదయాత్ర ఆదివారం కొత్తగూడేనికి చేరుకొంది. ఈ పాదయాత్ర జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని పాలకేంద్రం నుంచి మొదలైన మాలల మహా పాదయాత్ర ఓల్డ్ డిపో, గణేష్ టెంపుల్, సూపర్ బజార్, బస్టాండ్ మీదుగా, పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు చేరుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జెండా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విధానంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వలు చేపడుతున్న విధానాలు మార్చుకోవాలని, దళితులకు రాజ్యాధికారం లేకుండా చేస్తున్నారని అన్నారు. మందకృష్ణ మాదిగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పావుగా మారి , అన్నదమ్ముల ఉన్న మాల మాదిగలను విచ్చిన్నం చేసే కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణ జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం ఈ మాలల మహాపాదయాత్ర చేపట్టామని తెలిపారు.వర్గీకరణ అమలులో ఎక్కువగా నష్టపోయేది మాలలే ఈ వర్గీకరణ అమలుకు మరి ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునర్ పరిశీలించాలని కోరారు.అక్టోబర్ 25 నా భద్రాచలంలో ప్రారంభమైన పాదయాత్ర మొత్తం 16 జిల్లాలు 35నియోజవర్గాలు లో 1000 కిలోమీటర్లు 38 రోజులు కొనసాగుతున్న పాదయాత్ర, డిసెంబర్ 1తో హైదరాబాదులో ముగియనున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, నవతన్, సురేందర్, పరంజ్యోతి, శంకర్, రామారావు, శ్రీకాంత్, బడుగు శంకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 51
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News