మానాపురం తండా లో జ్వరంతో బాలిక మృతి

ఆర్ఎంపీ వైద్యం వికటించడమే కారణమా.......?

మానాపురం తండా లో జ్వరంతో బాలిక మృతి

మానాపురం తండా లో జ్వరంతో బాలిక మృతి

ఆర్ఎంపీ వైద్యం వికటించడమే కారణమా.......?IMG-20241026-WA0013


సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామ శివారు మానాపురం తండాకు చెందిన ఐశ్వర్య అనే 15 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ తండాకు సమీపంలో ఉన్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామం కు చెందిన ఒక గ్రామీణ ఆర్.ఎం.పి వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి వాంతులు చేసుకొని ఐశ్వర్య మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతి చెందిన బాలిక బంధువుల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఐశ్వర్య మూడు రోజు లుగా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం పాఠశాలకు వెళ్లి పరీక్ష రాసి వచ్చాక జ్వర తీవ్రత పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హరిపిరాల గ్రామంలోని గ్రామీణ వైద్యుడు వద్దకు చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లగా ఇంజక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి వెళ్లడంతో గ్లూకోస్ బాటిల్స్ పెట్టి చికిత్సను కొనసాగించినట్లు తెలిసింది. అయినా ఐశ్వర్య అప స్మానిక పరిస్థితి నుండి బయటకు రాకపోవడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం ఆటోలో తొర్రూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పట్ల వివాదం జరిగే అవకాశాలు కనిపించడంతో పోలీసులు సమాచారం తెలుసుకుని ఐశ్వర్య మృతదేహం వద్దకు చేరుకున్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 200
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News