విజయానికి ప్రతీకగా విజయదశమి
పులిగిల్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
శని పై సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారని పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు. అనంతరం ప్రతి ఏటా నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని,పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖసంతోషాలతో నిత్యం విజయాలు అందు కోవాలని, ఆకాంక్షించారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకేచోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకో వడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని గుర్తు చేశారు. హిందువులు జరుపుకునే పండుగల్లో దసరా పండుగ అతి పెద్దదని,ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని గ్రామపంచాయతీ దగ్గర్లోని గడి మైసమ్మ అమ్మవారిని ప్రార్థించారు. ఈ జెండా కార్యక్రమంలో పులిగిల్ల గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comment List