ప్రకృతితో ప్రజలకు ఉండే సంబంధాన్ని తెలిపే పండుగే బొడ్డెమ్మ
ప్రజా ప్రభుత్వంలో మహిళలకే అత్యధిక ప్రాధాన్యత
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి
రాయపర్తి మండలం, మైలారం గ్రామంలోనీ వివిధ వార్డులలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైన బొడ్డెమ్మ (గౌరమ్మ) పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించగా ఉత్సవ వేడుకలలో స్థానిక మహిళలతో కలిసి సంస్కృతిక కోలాట నృత్యాలు చేస్తూ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి
*ఈ సందర్భంగా ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ
ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా తెలిపే పండుగాలే బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండుగలలో కేల్లా పెద్ద పండుగ స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తికీ ప్రతిరూపకంగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు.తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో స్త్రీలు ఎంతో గౌరవంతో ఉంటున్నారని, ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, గృహలక్ష్మి, మహాలక్ష్మి, పథకాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శమని, మహిళలను అన్ని విధాలుగా ముందుకు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు జాటోత్ హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, నియోజవర్గ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి,గంజి దేవేoదర్ రెడ్డీ, గ్రామ పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి ఎల్లారెడ్డి, మరియు మండల ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు,ఆడపడుచులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List