"మీతో పాటు నేను ఒక రైతు బిడ్డని"- రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి...!
రైతులు పోవాల్సింది పురుగు మందుల దుకాణానికి కాదు...? వ్యవసాయ కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలి...!
"పొలం పిలుస్తుంది" కార్యక్రమంలో- రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి యం.వరప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం "పొలం పిలుస్తుంది" అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు ప్రత్యేకంగా వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన "పొలం పిలుస్తుంది" అనే ఈ కార్యక్రమంలో మంగళవారం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మౌనిక మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరవ రామాకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించే పంటలను అనేక రకాల చీడపీడలు ఆశించి, మొక్కలకు వివిధ రకాలు వ్యాధులు సోకి, పంట నష్టంతో తీవ్రంగా దిగుబడులు తగ్గి , రైతులు పంటలపై పెట్టుకున్న ఆశలు చివరికి నిరాశగానే మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి రైతుల ఆలోచన విధానంలో మరియు వ్యవహార శైలిలో మార్పులు రావాలన్నారు. రైతన్నలు తమ పొలాల్లో వేసిన పంటలను అనేక రకాల చీడపీడలు ఆశించి వాటి ద్యారా మొక్కలకు సోకిన వ్యాధుల నివారణ కొరకు ముందుగా పురుగు మందుల దుకాణాలకు వెళ్లకుండా దగ్గరలోని అందుబాటులో గల వ్యవసాయ కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని ఆయన రైతులను కోరారు. మండలంలో పెద్ద పెద్ద చదువులు చదివి, ఆధునిక టెక్నాలజీ కలిగిన వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలు రైతుల కొరకు అందుబాటులో ఉన్నారని, రైతులు తప్పకుండ వారి సలహాలు మరియు సూచనలు పాటించి అధిక దిగుబడులు సాదించాలని అన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయ అధికారులు పంటలను సందర్శించి తగిన సూచనలు రైతులకు వివరించడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో వ్యాధి సోకిన పంట మొక్కలపై మన ఫోన్ లోనే ఒక యాప్ ద్వారా ఫోటో తీస్తే చాలు, ఆ మొక్కకు ఏ వ్యాధి సోకిందో నిర్దారించి, అందుకు తగిన సలహాలు సూచనలు కూడా చూపిస్తుందని అన్నారు. కాబట్టి రైతులు ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. పంటలలోని మొక్కలకు సోకిన వ్యాధుల నివారణ కోసం రైతులు వ్యవసాయ అధికారులను సప్రదించుకోకుండా, పురుగు మందుల దుకాణదారుల దగ్గరకు పోవడం ద్వారా వారికి ఎక్కువ లాభలు వచ్చే పురుగు మందులను మాత్రమే రైతులకు ఇవ్వడం జరుగుతుందని అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడానికి ఆస్కారం ఉందని వెల్లడించారు. కావున రైతన్నలు వ్యవసాయ అధికారులను సంప్రదించి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా ముందుకు సాగాలని, నేను మీలాగే ఒక రైతు బిడ్డగా చెబుతున్నానని అన్నారు. తొందరలో టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు అనేక రకాల పథకాలు అమలుకానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ నాయకులు మల్లికార్జున, నరసింహ రెడ్డి, చిన్నతుంబళం వీరేష్ గౌడు, బొగ్గుల నరసన్న, క్రాంతికుమార్, గుడిసె మల్లికార్జున, అయ్యప్ప ఎంపీఈఓ శ్వేత, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇందు మరియు రైతులు పాల్గొన్నారు.
Comment List