మహిళా చట్టాలపై  వెల్లివిరిసిన  న్యాయ చైతన్యం

వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న    జడ్జీలు - సీనియర్ సివిల్ జడ్జి, సురేష్ - ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక - అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తిరుపతి -  పర్యవేక్షించిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి  శ్రీ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్.

మహిళా చట్టాలపై  వెల్లివిరిసిన  న్యాయ చైతన్యం

 


శనివారం మహబూబాబాద్ IMG_20240728_102249 జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన న్యాయచైతన్య సదస్సులలో జడ్జీలు  పాల్గొని మహిళా చట్టాలపై చైతన్యం కలిగించడం జరిగింది.  
 ఈ కార్యక్రమాల్లో భాగంగా  మొదటగా సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహబూబాబాద్ వారు జైల్లో ఖైదీలతో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో  85 మంది ఖైదీలు పాల్గొనడం జరిగింది. 

 ఇదే రోజు జైల్లో ఖైదీలతో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అయిన మౌనిక  జైల్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ జైల్ అదాలత్ లో 3 కేసులను సెట్ అప్ చేయడం జరిగింది. 

ఈ రోజే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, శ్రీమతి పి మౌనికచే మహబూబాబాద్ జిల్లా కేంద్రం పరిధిలోని  వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర గల ప్రభుత్వ బాలికల ఫార్మసీ కళాశాలలో  విద్యార్థినిలకు మహిళా చట్టాలపై న్యాయ చైతన్యం కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలికలకు POCSO చట్టం,  బాల కార్మిక చట్టం, బాల్యవివాహాలు, మహిళల అక్రమ రవాణా మొదలైన ఆకృత్యాల గురించి సవివరంగా విద్యార్థినిలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  దాసరి నాగేశ్వర్రావు,కళాశాల ప్రిన్సిపల్ స్వప్నారెడ్డి పాల్గొన్నారు.
 
జిల్లా పరిషత్తు హైస్కూల్, తాళ్లపూసపల్లిలో జరిగిన మరొక న్యాయచైతన్య సదస్సులోఅదనపు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అయిన తిరుపతి పాల్గొని మహిళా చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్,మురళీధర్ రాజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట కనకయ్య పాల్గొని కార్యక్రమాన్ని విజవంతం చేయడం జరిగింది. 
 ఈ కార్యక్రమాలన్నింటిని  గౌరవ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అయిన శ్రీ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ పర్యవేక్షించారు.

Read More అనాధలకు అండగా

Views: 5
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News