రాష్ట్ర విద్యావ్యవస్థ నందు ఒకే సిలబస్ అమలు చేయాలి
యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జె.ఎల్లప్ప
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని మేనేజ్ మెంట్ల పాఠశాలల్లో ఒకే సిలబస్ అమలుచేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జె.ఎల్లప్ప డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన నందవరం నందు యుటిఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా నందవరం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడ గతంలో ఒకే సిలబస్ అమలు అయ్యేది కేంద్ర విద్యాసంస్థలు మరియు కొద్దిపాటి ప్రవేట్ పాఠశాలల్లో సిబిఎస్ఇ సిలబస్ లు బోధించేవారు.అయితే గత ప్రభుత్వం రాష్ట్ర మంతటా సిబిఎస్ఇ సిలబస్ అమలు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిందని , కాని 1046 ఉన్నత పాఠశాలల్లో మాత్రమే సిబిఎస్ఇ సిలబస్ ప్రారంభించారన్నారు.స్టేట్ సిలబస్,సెంట్రల్ సిలబస్ పేరుతో రెండు రకాల సిలబస్ లు అమలుచేశారన్నారు. ఇలా రకరకాల సిలబస్ ల పేరుతో విద్యారంగంలో ప్రయోగాలు చేస్తూ పోతూంటే విద్యార్థులలో గందరగోళం ఏర్పడుతుందన్నారు.ఉపాధ్యాయులకు కూడ ఏ సిలబస్ ను బోధించాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కనుక కొత్త ప్రభుత్వం రకరకాల సిలబస్ లు,పరీక్ష విధానాలకు స్వస్తి పలికి రాష్ట్ర మంతటా ఒకే సిలబస్ అమలుచేయాలని ఇందుకోరకు ఎస్సీఈఆర్టీ ని బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు మరియు ఉపాధ్యాయులు యస్.పరమేష్, పి.మద్దయ్య,యం.నరసన్న,ప్రసాద్,సూర్యనారాయణ శెట్టి,సూర్యనారాయణ, శేఖరప్ప, హానీఫ్ యం.ఉమాదేవి,లక్ష్మీ కళ,పార్వతి దేవి,కేశవయ్య,ఈరన్న,రామకృష్ణ,ధర్మన్న కె.విజయలక్ష్మి,వాణీపరిమల, వి.విజయలక్ష్మి,కోటేశ్వరాచారిపరిమళ,శాంతల తదితరులు పాల్గొన్నారు.
Comment List