ఐఎన్టియుసి కేంద్ర నాయకుడి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం
అడ్డుకున్న జనరల్ సెక్రెటరీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ,కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్,
ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఎన్టియుసి కార్యకర్తలు,నాయకులు
ఐఎన్టియుసి కేంద్ర నాయకుని దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం
యూనియన్ లో పదవులు ఇచ్చే అర్హత లేని నాయకుడు
లెటర్ ప్యాడ్, వాట్సప్ తో పదవులు చెల్లవు
సభ్యత్వం లేని వ్యక్తిని నాయకుని ఎలా చేస్తారు
ఆగ్రహం వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు కార్యకర్తలు
కార్యకర్తలను అడ్డుకొని సంముదయించిన ఏరియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్
కొత్తగూడెం జనవరి 26: ఐ ఎన్ టియు సి కొత్తగూడెం ఆఫీస్ వద్ద ఐఎన్టియుసి కార్యకర్తలు శుక్రవారం కేంద్ర నాయకుడు సెక్రెటరీ జనరల్ జన ప్రసాద్ దిష్టిబొమ్మ దాహనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ..యూనియన్ గెలిసి నెల రోజులు పూర్తి అయింది. కొత్తగా కార్పొరేట్, ఏరియాల లో కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు కేటాయించాల్సింది ఉండగా, తాజాగా గురువారం యూనియన్ లో గతంలో ఉన్న పదవులు అన్ని రద్దు చేస్తున్నట్లుగా సెక్రెటరీ జనరల్ బి.జనక ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేసి,తక్షణమే ఇక్కడున్న నాయకులను ఎవరిని కూడా సంప్రదించకుండా తనకు ఇష్టం వచ్చిన వారికి తాయిలాలకు అమ్ముడుపోయి, అసలు సెక్రటరీ జనరల్ అనే పదవి అనేది ఉండదు.ఏదో యూనియన్లో ఒక పదవి వాళ్లు సొంతంగా ఇచ్చారు. దాన్ని ఆసరా చేసుకుని చలామణి అవుతూ. యూనియన్ కష్ట కాలంలో పట్టించుకోకుండా, ఆఖరికి మొన్నజరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కనీసం ప్రచారానికి కూడా రాకుండా,ఎన్నికల మెటీరియల్ ఖర్చు కూడా ఫండ్ ఇవ్వకుండా, సొంత ఖర్చులతో యూనియన్ ని నాలుగు ఏరియాలలో గెలిపించుకున్నాక, గెలిచాక కార్మికులని కలవడానికి కూడా రాని నాయకుడు. రేపు ఎలక్షన్ అనగా అంతకు ముందు రోజు టీబీజీకేస్ నుంచి వచ్చి యూనియన్లో చేరుతామని కండువా మాత్రమే కప్పుకొని, యూనియన్ సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు యూనియన్ పగ్గాలు ఎలా ఇస్తారని యూనియన్ కార్యకర్తలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కమిటీలు వేసి అందరి ఆమోదంతోనే నాయకులు ఎన్నుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Comment List