సంక్షేమ గురుకులాలలో విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలి
రంజోల్ గురుకుల కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం వెంటనే విద్యార్థిని కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి
కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో బైపిసి (BiPC) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న క్లాస్ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకోన్నది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థిని విద్యార్థుల మరణాలకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులంతా పేద విద్యార్థులే వారిపట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని అన్నారు. అమ్మాయి కళాశాలలో ఉరివేసుకొని చనిపోయింది. ఈ ఘటన పై ఉన్నత అధికారులతో సమగ్ర విచారణ జరపాలని కారుకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థిని కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అంతక్రియల కోసం లక్ష రూపాయలు ఇల్లు నిర్మాణం కోసం 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు...కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్ శివకుమార్ సుభాష్ ప్రవీణ్ మహేష్ తదితరులు ఉన్నారు...
Comment List