కొత్తవలస రైల్వే ప్రమాదంపై ఆవేదన
ఇంకా ఎంతమంది చనిపోతే రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకొస్తారు
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
న్యూస్ ఇండియా తెలుగు: విజయనగరం
విజయనగరం జిల్లా కొత్తవలసలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విజయనగరం వైపు బయలుదేరి రైల్వే ట్రాక్ పై ఉన్న విశాఖపట్నం పలాస రైలును కొద్ది నిమిషాలు తేడాతో విశాఖపట్నం రాయగడ రైలు ఢీకొంది ఈ ప్రమాదంలో రాయగడ భోగిలో కొన్ని పట్టాలు తప్పయి ఈ ప్రమాదం రాత్రి 7 గంటల తర్వాత జరగడంతో సహాయక చర్యలకు చాలా ఇబ్బందిగా మారింది ఎవరు ఏ భోగిలో ఇరుక్కున్నారు అన్నది సరిగ్గా కనిపించలేదు మొత్తం పలాస రాయగడ ప్యాసింజర్ లో 1400 మంది ప్రయాణికులు ఉన్నారు మృతుల సంఖ్య సంఖ్య 40 నుంచి 50 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం దీనిపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఎంతమంది చనిపోతే రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకొస్తారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో జరిగిన ఒక రైల్వే ప్రమాదంలో కరెంట్ షాక్ వచ్చి చాలామంది భోగిలోనే బూడిద అయిపోయారు అప్పటి రాజ్యసభ సభ్యులు చిరంజీవి రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సంవత్సరం జూన్ లో జరిగిన బాలేస్వర్ రైలు ప్రమాదం కూడా ఇదే విధంగా జరిగిందని అప్పుడు కూడా అనేకమంది రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని పెద్ద ఎత్తున తన యొక్క వాయిస్ వినిపించారని అయినా మళ్లీ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని ఆడారి నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
Comment List