జాతీయస్థాయి డ్రాప్ రో బాల్ పోటీలో తెలంగాణ జట్ల విజయకేతనం
తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహమత్
ఓజాతీయస్థాయిలో డ్రాప్ రో బాల్ క్రీడలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని హైటెక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో తేదీ 29- 9- 2023 నుండి 2-10- 2023 వరకు జరిగిన 13వ జాతీయస్థాయి సబ్- జూనియర్ మరియు జూనియర్ డ్రాప్ రో బాల్ టోర్నమెంట్ లో దేశం నుండి సుమారుగా 20 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర జట్టు సబ్ జూనియర్ బాలురు అండర్- 17 డబుల్స్ విభాగంలో టి. భవిన్, ఎం, రుతిక్, కే.ప్రణీత్, పి,సాత్విక్, లు ఫైనల్ లో ఉత్తరప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్లు హోరాహోరీగా తలపడి, రెండో స్థానంలో నిలిచి, వెండి పతాకాన్ని కైవసం చేసుకుంది. బాలురు అండర్- 17 విభాగంలో వి. అమోఘ, కేరళ వర్సెస్ తెలంగాణ జట్లు తల పడగగా, తెలంగాణ జట్టు, మూడవ స్థానంలో, నిలిచి రజత పథకాన్ని కైవసం చేసుకున్నది. అలాగే అండర్ 17 మిక్స్డ్ డబుల్ విభాగంలో సిహెచ్. తేజేశ్వరరావు, టి .మహంతి లు మహారాష్ట్ర వర్సెస్ తెలంగాణ జట్లు లు తలపడి, తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి, రజక పథకాన్ని ,కైవసం చేసుకుంది. బాలికల అండర్ -17 సింగిల్ విభాగంలో జె.చరిష్మారెడ్డి, హిమాచల్ ప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్లు లు హోరా, హోరీగా తలపడి , తెలంగాణ జట్టు మూడవ స్థానంలో నిలిచి,, రజక పథకాన్ని కైవసం చేసుకుంది. బాలికల అండర్ -17 త్రిపల్ విభాగంలో వి.సాయి హాసిని, ఏ. సహస్ర, ఆర్ .మాన్యత, వి.సిగద, ఏ. ప్రణవి, కే.శ్రీ వర్షిని లు చత్తీస్ ఘడ్ వర్సెస్ తెలంగాణ జట్లు పోటీపడి , తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి, రజక పథకాన్ని కైవసం చేసుకుంది. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డ్రాప్రో బాల్ రాష్ట్ర టెక్నికల్ కార్యదర్శి ఎండీ అక్బర్ బాబా క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్రాప్ రో బాల్ కోచ్ లు బి నవీన్, ఈ తరుణ్ ,పి గణేష్, ఏ అరుణ్ మల్కాజ్గిరి జిల్లా ఇన్చార్జిలు జే సురేందర్ అనూష రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు
Comment List