తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

ముఖ్య అతిథులుగా హాజరైన సీఎన్ రెడ్డి

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

IMG_20230926_194348

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని జిల్లా గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా రజకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి జిల్లా నాయకులు సీఎన్ రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తేగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన చాకలి ఐలమ్మదేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు వడ్లకొండ సత్తయ్య, వడ్డేమాన్ మహేందర్,వడ్డేమాన్ శ్రీనివాస్, వడ్డేమాన్ రవి, మధు, నరేష్ గణేష్ శివకుమార్, అనపర్తి శ్రీనివాస్, వడ్డేమాన్ గణేష్ ,కమలాకర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 17
Tags:

Post Comment

Comment List

Latest News