ప్రభుత్వ బడి పిల్లలు..ప్రపంచానికి పాఠాలు
ఆంధ్ర గర్వించేలా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం
రాష్ట్రం, దేశం గర్వించేలా అగ్రరాజ్యం అమెరికాలో తమ ప్రతిభ చూపిస్తున్న ఆంధ్రా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, కొలంబియా యూనివర్సిటీలలో జరిగిన సదస్సుల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన చదువుల విప్లవం గురించి ప్రసంగించారు.. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం విద్య మరియు ఆరోగ్య రంగంలో తెచ్చిన అనేక సంస్కరణలపై వారికి వివరించారు.. ముఖ్యంగా విద్యా రంగంలో జగనన్న తెచ్చిన అమ్మఒడి, నాడు నేడు, ద్విభాషా పుస్తకాలపై వారు చేసిన ప్రజంటేషన్ పట్ల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముగ్ధులయ్యారు.. జగన్ ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగంలో గొప్ప సంస్కరణలు అమలు చేసిందని కొనియాడారు.. మానవ వనరుల అభివద్ది కోసం జగనన్న ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామన్నారు.. భవిష్యత్తులో విద్యా రంగంలో మరింత ప్రభావవంతంగా కలిసి పనిచేసేందుకు ఏమేం చేయవచ్చే ఆలోచనలు అందించాలని కోరారు.. ఈ సందర్భంగా మన విద్యార్థులు కొన్ని గొప్ప ఆలోచనలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పంచుకున్నారు..
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List