రైతుల భూ సమస్యలను తక్షణ పరిష్కారమే భూ భారతి చట్టం.

వ్యక్తి కి ఆధార్, భూమికి భూదార్.

On
రైతుల భూ సమస్యలను తక్షణ పరిష్కారమే భూ భారతి చట్టం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : జూన్ 2 నుండి ప్రతి గ్రామానికి తహసిల్దార్ స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి భూ సమస్యల పై దరఖాస్తులు తీసుకుంటారని, రైతులు ఒక రూపాయి కూడా చెల్లించకుండా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని జిల్లా కలెక్టర్ కలెక్టర్ క్రాంతి వల్లూరూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం కేంద్రలో, రాయ్ కోడ్ మండల కేంద్రం లోని ప్రైవేట్ ఫంక్షనల్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు, వేర్వేరుగా ఆర్డిఓ రామ్ రెడ్డి తాహసిల్దార్ దశరథం, సంబంధిత అధికారులు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని 4 మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగిందని, ఈ నెలాఖరునాటికి ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తవుతుందని, జూన్ 2  నుండి ఈ పైలెట్ మండలాలలో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించ నున్నామని తెలిపారు. గతంలో భూములు అమ్మిన, కొన్న మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. సాదా బైనామాలకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదని, భూ భారతిలో దీనిని పరిష్కరించనున్నామని ధరణి సమయంలో ప్రభుత్వం వద్దకు ప్రజలు వెళ్లాల్సి వచ్చేదని, వీటన్నిటికీ పూర్తిగా న్యాయం జరిగేలా భూ భారతి లో ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమిపై ఉన్న వారికె పట్టాలు ఇవ్వాలని, సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని ,భూభారతి పై విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు.  మోఖ మీద ఉన్న వారి పేరును భూ భారతి ద్వారా ఎక్కించే బాధ్యత రెవెన్యూ శాఖదేనిని, భూభారతి ద్వారా తహసిల్దార్ ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. వ్యక్తికి ఆధార్ లాగా భూమికి భూదార్ ను ప్రవేశ పెట్టిందన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ ఈ చట్టంపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని, చట్టంలో ఉన్న సెక్షన్లను నోటీసు బోర్డు పైన ఉంచాలన్నారు. ఈ భూభారతి  అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ భూభారతి, చట్టం వల్ల పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వ అమలు చేస్తున్నదని ,వీటన్నిటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి,బిసి సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ,రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. 222

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News