మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

ఆస్పత్రిలో వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్న కలెక్టర్

On
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

మరిన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలి

IMG-20240723-WA1147భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ఇండియా ) జులై 23: కొత్తగూడెం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆకస్మిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓపి బ్లాక్‌, పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డ్‌, చిన్నపిల్లల ఓపీ, ఆరోగ్య మిత్ర, మందులు ఇచ్చే గది, పోస్ట్‌ నెటల్‌ వార్డు, రిసెప్షన్‌లను తనిఖీ చేసి, ఆసుపత్రిలో ఉన్న రికార్డులను పరిశీలించిన కలెక్టర్‌ ప్రతి రోగి వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న రోగులతో కలెక్టర్‌ మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  వైద్యులు సకాలం లో విధులకు హాజరు కావాలని అధికారులకు సూచించారు. మాతా, శిశు ఆసుపత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయో అడిగి తెలుసుకున్న కలెక్టర్‌, ప్రభుత్వ ఆసుపత్రు లలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, మరిన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో కావలసిన సదుపాయాలు మరియు చేపట్టాల్సిన పనుల కు సంబంధించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, డాక్టర్ సరళ, డాక్టర్ వీరబాబు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 26
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News