యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ షేక్ అజారుద్దీన్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
అజారుద్దీన్ యర్రగొండపాలెం లో డిగ్రీ వరకు విద్యను అభ్యసించి ఉన్నత చదువుల కోసం మాస్టర్ ఆఫ్ కామర్స్ లో ర్యాంకును పొంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీటు పొందారు. అక్కడ ఎస్ఎఫ్ఐ టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలలో పనిచేసి తనదైన ముద్రను వేసుకున్నారు. ఒకానొక సందర్భాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రత్యేక హోదా కోసం అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ గా ఉండి విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. విద్యాలయాలలో రాజకీయానికి ప్రవేశం లేకుండా ఉండాలని బలంగా కోరిన వ్యక్తిలో అజారుద్దీన్ ఒకరు. విద్య అనంతరం యర్రగొండపాలెం విచ్చేసిన అజారుద్దీన్ ఒకవైపు ప్రజాసేవ కార్యక్రమం అయిన పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం, గ్రామంలోని స్వచ్ఛంద సంస్థలతో పాటు తను కూడా పాలు పంచుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు.
సేవా రంగంలో:
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో M.Com అభ్యసించేటప్పుడు తన స్నేహితుడి చుట్టాల పాపకు తల సేమియా వ్యాధితో బాధపడుతుండగా ఆ సమయంలో అరుదైన ఓ నెగిటివ్ రక్తం దొరకక ఆ పాప చనిపోయింది. దీంతో చలించిపోయిన అజారుద్దీన్ ఆ క్షణం లో నిర్ణయించుకొని తనదాకా వచ్చిన రక్త అవసరాన్ని కాదనకుండా ఇప్పటివరకు 976 మందికి రక్తదానం చేయించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. అలాగే గుంటూరు విజయవాడ హైదరాబాద్ నగరాలలో అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరులోని పట్టాభిపురం అనాధాశ్రమం, నాగార్జున యూనివర్సిటీ పక్కన కాజా గ్రామంలోని ఆమోదిని అనాధాశ్రమాలలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి కరోనా సమయంలో ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
రాజకీయం:
రాజకీయరంగంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సోషల్ మీడియా పరంగా కీలక పాత్ర పోషించిన వ్యక్తిలో అజారుద్దీన్ ఒకరు. ఇన్చార్జి ఎరెక్షన్ బాబు గారికి నమ్మకస్తుడిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజలలో తీసుకువెళ్లడానికి రాత్రింబవళ్లు కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. తండ్రి షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్) ఎర్రగొండపాలెం పట్టణ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి రాజకీయపరంగా తనదైన శైలిలో పని చేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పరంగా మునుపెన్నడూ లేని విధంగా సోషల్ మీడియాను ముందుకు తీసుకువెళ్లడంలో అజారుద్దీన్ ప్రధాన పాత్ర పోషించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా విద్యార్థి సమస్య తెలిస్తే అక్కడ అజరుద్దీన్ ప్రత్యక్షమవుతారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తన సహాయ శక్తులా పనిచేస్తానని తెలిపారు.
సంవత్సరాల తరబడి పార్టీ కోసం అలుపెరుగని కృషి, పట్టుదలతో అందరితో ఔరా అనిపించేలా పనిచేసిన వ్యక్తి అజారుద్దీన్. పార్టీ కోసం చేసిన సేవలు కాకుండా సమాజం కోసం తాను చేసిన సేవా కార్యక్రమాలు అనేకం. రక్తదానాలు, అన్నదానాలు చేసి తనకున్న మంచి మనస్సు చాటుకున్నారు. అందరిని ఆప్యాయంగా పలకరించి, అందరి మన్ననలు పొందిన మంచి మనిషి షేక్ అజారుద్దీన్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు... ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాము.
Comment List