జాతీయ రహదారిపై 65 నెంబర్ పై దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.
రిటైర్ ఆర్మీ కెప్టెన్ బెల్లి నరసింహ ఇంట్లో భారీ చోరీ..
రహదారి వెంబడి ఉన్న ఇల్లు టార్గెట్ చేసుకొని వరుస చోరీలు..
న్యూస్ ఇండియా తెలుగు ,జూన్ 16 (నల్లగొండ జిల్లా ప్రతినిధి, బెల్లి శంకర్) జాతీయ రహదారిని టార్గెట్ చేసుకొని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 65 నెంబర్ పై కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన బెల్లి నరసయ్య రిటైర్ ఆర్మీ కెప్టెన్ ఇంట్లో దొంగలు చొరబడి తులం నారా బంగారం ,ఇరవై మూడు తులాల వెండి దొంగలించడం జరిగింది తెలియజేశాడు. బాధితుడు చెప్తున్న వివరాల ప్రకారం ఆర్మీ నుండి రిటైర్ అయిన తర్వాత సొంత గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు రోజువారీగా మేడ మీద నిద్రిస్తున్నారు, మధ్యరాత్రి దాదాపు సమయం ఒకటిన్నర ప్రాంతంలో వర్షం కారణంగా కిందికి రావడం జరిగింది, వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి బీరువా ఓపెన్ చేసి, బీరువాలో ఉన్నటువంటి దుస్తువులు కింద వేసి ఇల్లు మొత్తం చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.దీనిపై స్థానిక కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాడు.
Comment List