రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ6 గ్యారంటీల అమలు
ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
కంగ్టి
,జనవరి05 న్యూస్ ఇండియా రాజకీయా పార్టీలకు అతీతంగా 6 గ్యారంటీల అమలు చేస్తుందని ఎమ్మెల్యే డా పట్లోల సంజీవ రెడ్డి అన్నారు.నారాయణఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన కంగ్టిలో గురువారం రోజు నిర్వహించిన ప్రజపాలన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజల ముంగిటికే ప్రభుత్వం వచ్చి,ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందని అన్నారు. రాబోయే రోజులలో ఆ పనులు చేయాలని ప్రభుత్వ ఉద్దేశమన్నారు.ఆరు గ్యారెంటీలలో రెండు పథకాలు అమలు అవుతున్నాయి అన్నారు. ఒకటి పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచి వైద్య సేవలుఅందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ఎమ్మెల్యే డా పట్లోల సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రజల పక్షాన, ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని, ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయేలా చేసి చూపిస్తామని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేదలకు న్యాయం జరిగేలా పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో. దిగంబర్ రెడ్డి మాజీ సర్పంచ్. రాజశేఖర్ రెడ్డి ఎంపిటిసి. భూంకొండ మాజీ ఎంపీటీసీ. విట్టల్ రెడ్డి. రాజు వార్డు సభ్యులు. సంగీత వెంకటరెడ్డి ఎంపీపీ కంగ్టి. షాదుల్ మాజీ ఎంపీపీ. మనోహర్ మాజీ సర్పంచ్.సర్దార్ మాజీ జెడ్పిటిసి.మల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు. మనోజ్ పాటిల్ పి సి ఎస్ మాజీ చైర్మన్. వైద్యనాథ్ పాటిల్ పీసీ డైరెక్టర్. ముకుందా నాయక్ తండా సర్పంచ్ సురేఖ రాథోడ్, నాయకులు కర్ణం వాసు పటేల్. కృష్ణారెడ్డి. కాలే రాజు. శ్రీనివాస్ రెడ్డి.మనోహర్.సంజయ్. జ్ఞానేశ్వర్ పాటిల్ రైతు సంఘం అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు,ఆయా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారి, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Comment List