ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం కెసిఆర్ మరియు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరు అయ్యారు. ఈ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడానికి 'తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని, ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి ప్రసాదించారని కొనియాడారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ కు మళ్ళీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంగారెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సభకు వచ్చిన వేలాదిమంది ప్రజల మరియు వారి ఆదరణ చూసి బాగోద్వేగానికి గురయ్యారు పక్కనే ఉన్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చింత ప్రభాకర్ ఓదార్చారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ ను తీసివేస్తారని ప్రజలందరూ మళ్లీ ఇబ్బందులు పడతారని అన్నారు. తెలంగాణ పోరాటంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓయూ విద్యార్థులను యూనివర్సిటీలో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని తెలంగాణ అమరవీరుల ఉసురుపోసుకుందని అన్నారు. గత ఎన్నికలో చింతా ప్రభాకర్ ను సంగారెడ్డి ప్రజలు ఓడించి పొరపాటు చేశారని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడని అన్నారు. చింతా ప్రభాకర్ ను గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటాడని మరియు గతంలో చింత ప్రభాకర్ మెట్రో సర్వీస్ సంగారెడ్డి వరకు పొడిగించాలని తను స్వయంగా నన్ను కోరారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బి ఆర్ ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఓటు వేసే ముందు ఎవరికి వేస్తున్నామో ఎందుకు వేస్తున్నమో ఆలోచించి వేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comment List