కాంగ్రెస్ గ్యారంటీలు అద్భుతం పల్లె పల్లెనా బ్రహ్మరథం పడుతున్న మహిళలు, ప్రజలు : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ
రిపోర్టర్ జైపాల్ ఉమ్మడి మెదక్ జిల్లా టేక్మాల్ మండలం అక్టోబర్ 16:
ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు మండలంలోని వివిధ గ్రామాల్లో దామోదర రాజనర్సింహ పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నుంచి బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు బక్క సిద్దు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ వార్డ్ నెంబర్లు పెంటయ్య, మల్లేశం, వీరితో పాటు వివిధ గ్రామాలకు చెందిన యువత, నాయకులు సుమారుగా 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నిమ్మరమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల అధ్యక్షులు మండల స్థాయి నాయకులు ఎన్ ఎస్ యు ఐ టేక్మాల్ మండల అధ్యక్షులు అడవయ్య మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List