మత విద్వేషాలు రెచ్చగొట్టే ‘ఏ పని చేసిన’ కఠిన చర్యలు తప్పవు.

On
మత విద్వేషాలు రెచ్చగొట్టే ‘ఏ పని చేసిన’ కఠిన చర్యలు తప్పవు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23, న్యూస్ ఇండియా : మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు తప్పవని ముల్టీ జోన్ -II ఐజిపి పి.సత్యనారాయణ ఐపిఎస్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఐజి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా, జిన్నారం గ్రామంలో శివారులో నిర్మాణంలో ఉన్న శివాలయం ముందు ఉన్న శివుని విగ్రహం ధ్వంసం అయిన విషయమై నిన్న తేది : 22.04.2025 నాడు సాయంత్రం జిన్నారం మండలంలో జరిగిన సంఘటనల పై జిల్లా ఉన్నత అధికారులచే దర్యాప్తు చేయించగా విచారణ అనంతరం తెలిసినది ఏమనగా.. తేది: 19.04.2025 నాటి సాయంత్రం 5:24 గంటల సమయంలో కొన్ని కోతులు వచ్చి శివుని విగ్రహం గుట్ట పై నుండి క్రిందికి తోసివేయడంతో క్రిందపడిన శివుని విగ్రహం ధ్వంసం చేసినట్లు విచారణలో తెలిసింది. వివరాలలోనికి వెళితే నిన్న తేది: 22.04.2025 నాడు సాయంత్రం గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు నుండి వస్తున్న మదర్సా విద్యార్ధులను చూసిన కొందరు స్థానికులు వారిని ప్రశ్నించిన అనంతరం శివాలయం వద్ద ధ్వంసమైన శివుని విగ్రహాన్ని చూసి, మదర్సా విద్యార్ధులే ఈ పని చేసినట్లుగా భావించి, పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా కొంత మంది వ్యక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళి మదర్సా లో ఆస్థి నష్టం చేయడం జరిగింది. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గతంలో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగాయని, గత 6 నెలల క్రితం సదాశివపేటలో ఓ గుడిలో ఆవులు ధ్వంసం చేస్తే, ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేయడం జరిగిందని, విచారణలో వాస్తవాలు రాబట్టి సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రజలందరూ మత సామరస్యం కలిగి ఉండాలని, శాంతి భధ్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు సమీప పోలీసు స్టేషన్ లో సమాచారం అంధించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు ఉంటాయని ఐజి గారు హెచ్చరించారు. అట్టి సంఘటనలో అనవసర రూమర్స్ ప్రచారం చేసి, ప్రజా శాంతికి విఘాతం కలిగించిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ సమస్యను జటిలం కాకుండా త్వరితగతిన స్పందించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, గారిని, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి ఐపిఎస్, సంగారెడ్డి జిల్లా అధికారులను, సిబ్బందిని ఐజి అభినందించారు. ఈ ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి, ఐపిఎస్.  తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-23 at 7.38.44 PM

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News