'బిఎస్ఎన్ఎల్' కస్టమర్ క్యాంపు నిర్వహణ.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23, న్యూస్ ఇండియా : కార్పొరేట్ ఆఫీస్ ఆదేశానుసారం సీజీఎం కార్యాలయం నందు 'బిఎస్ఎన్ఎల్' కస్టమర్ క్యాంపు నిర్వహణ చేపట్టారు. ఏప్రిల్ నెల 2025, కస్టమర్ సేవలందించే కార్యక్రమంలో భాగంగా తేదీ 22 ఏప్రిల్ నాడు ఈ క్యాంప్ ‘సీజీఎం కార్యాలయం’ నందు బైపాస్ రోడ్డు ప్రాంతంలో నిర్వహించారు. ఈ క్యాంపు కస్టమర్ మొబైల్ సర్వీస్, రీఛార్జ్ గురించి అడగడం జరిగింది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం దిశగా, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. సీజీఎం రాజరాజేశ్వరి ఆదేశానుసారం జరిగిన ఈ కస్టమర్ క్యాంపు ని దిగ్విజయంగా నిర్వహించినట్లు డీజీఎం శివరాం ప్రసాద్ తెలిపారు. ఏజీఎండి బాలాజీ మాట్లాడుతూ ‘4జి’ యాక్టివేషన్ ఏమైనా సమస్య ఉంటే…? త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం జగన్ ఎస్ డి ఈ లక్ష్మీనారాయణ జే టి ఓ డబ్లు శ్రీనివాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List