క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి
On
క్రిమిసంహారకమందు సేవించి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆత్మకూరు మండలంలోని లింగరాజు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన అంబోజు నరసింహ (54) తన కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈనెల 24వ తేదీ సాయంత్రం అతని కుమారుడైన వెంకన్నకు ఫోన్ చేసి తాను విషం తాగి వలిగొండ మండలం లోతుకుంట గ్రామ సమీపంలో ఉన్నట్లు తెలియజేయడంతో అక్కడి గ్రామస్తులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పొందుతూ 25వ తేదీ ఉదయం రెండు గంటలకు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై మహేందర్ తెలియజేశారు
Views: 83
Comment List