నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్..!
గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టన ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం పేదలకు ఇవ్వాలి...
- ఎన్నికల వేల ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయాలి.
న్యూస్ ఇండియా/ పెద్దకడబూరు మండలం శనివారం జనవరి 11 :- రాష్ట్ర పిలుపు మేరకు శుక్రవారం తహసిల్దార్ కార్యాలయం నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని , గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు మరియు పట్టణంలో రెండు సెంట్లు చొప్పున నిరుపేదలకు స్థలాన్ని ఇవ్వాలని రాష్ట్రా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గతంలో ఊరు బయట వాసయోగ్యానికి పనికిరాని స్థలాలు కేటాయించడం వల్ల పేదలు ఎవరు కూడా ఇల్లు కట్టించుకోవడానికి ముందుకు రాలేదని, ఇల్లు నిర్మాణానికి లక్ష 80 వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగిందని వాటితో పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు సరిపోలేదని అన్నారు. కావున ఎన్నికల కూటమి ప్రభుత్వం రాష్ట్ర అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు చొప్పున ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అధికారంలోకి దగ్గరగా సంవత్సరం కావస్తున్న చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నరు. గ్రామీణప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు లేని నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం, ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని కాబట్టి తక్షణమే పేదలకు ప్రభుత్వం తరుపున ఇంటి స్థలాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతేకంగా డిమాండ్ చెసారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వీఆర్వో నరసన్నకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు ఆంజనేయ , aiyf తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, తిక్కన, హనుమంతు, నరసింహులు, గోపాల్, రామాంజనేయులు, డోల్ హనుమంతు, రెక్కల గిడ్డయ్య, aiyf మండల కార్యదర్శి దస్తగిరి మరియు తదితరులు పాల్గొన్నారు...
Comment List