సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..
సంక్రాంతి అంటే- ‘చేరుట’ అని అర్ధం...
సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిలోకి చేరుతుంటాడు, సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ మొదటి రాశినుంచి తర్వాత రాశిలో ప్రవేశించడమే ‘సంక్రాంతి’..
*మకర సంక్రాంతి*
*ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం*
*సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ*
*శ్రీనాథ కవిసార్వ భౌముడు దీనిని ‘పెను బండువు’ అన్నాడు*
*సంక్రాంతి అంటే- ‘చేరుట’ అని అర్ధం*
సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిలోకి చేరుతుంటాడు, సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ మొదటి రాశినుంచి తర్వాత రాశిలో ప్రవేశించడమే ‘సంక్రాంతి’
అయితే, సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి కదా, మరి మకర సంక్రాంతి ప్రాముఖ్యం ఏమిటి?*
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జనవరి 14, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- సూర్యుని దివ్య యాత్రల్లో ప్రధాన ఘట్టాలలో మేష, తుల, మకర సంక్రమణలు ముఖ్యమైనవి, సూర్యుడు మకర రాశి చేరగానే ప్రకృతిలో అనేక మార్పులు కలుగుతాయి. ఆ మార్పుల చైతన్యమే ‘మకర సంక్రాంతి’లో కనుపి స్తుంది, సంవత్సరాన్ని రెండు ఆయనములుగా మనం విభజించుకుంటున్నాం
కటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకూ దక్షిణాయనం, మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకూ ఉత్తరాయణం, ఉత్తరాయణము దేవతా పూజకు, దక్షిణాయనము పితృదేవతారాధనకు ప్రధానం.
ఉత్తరాయణం ప్రారంభ మయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది, పాడి పంటలు సమృద్ధిగా ఇళ్ళకు చేరుకుంటాయి, పశుపక్ష్యాదులు ఆనందంగా కనిపిస్తాయి
వాస్తవానికి మన దేశంలో ప్రాకృతిక జీవనం అద్భుతంగా కనుపించేది ఈ పండుగ తరుణంలోనే, సూర్యుడు ధనూరాశి నుంచి మకర రాశికి ప్రవేశించగానే మకర సంక్రాంతి వస్తుంది, ఈ పండుగ పల్లె ప్రజలను ఆనందంగా ఉంచే పండుగ. పిల్లల్ని, పెద్దల్ని, ముఖ్యంగా రైతుల్ని ఆంనందోత్సాహాలలో ముంచే ఈ పండుగ మూడు రోజులు సాగుతుం ది
*భోగి*
మొదటి రోజు భోగి
భోగి మంట వేయడం ఈ రోజు ప్రసిద్ధి, కట్టెల్ని, పిడకల్ని కాల్చి భోగి మంట వేస్తారు. ఈ మంటలో మనలోని అసూయ, ద్వేషాల్ని వేసి, వెలుతురు అనే జ్ఞానాన్ని పొందాలనేది ఇందులో తాత్త్వికాంశం. పాత అలవాట్లు, కామ క్రోధాలను దహనం చేసి కొత్త క్రాంతి పొందాలనే సందేశం ఇందులో కనుపిస్తుంది, గృహిణులు, యువతులు ఇంటిని, ఇంటి ముందు వాకిలిని శుభ్రపరచి కల్లాపి చల్లి, అందమైన రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను కింద పడ కుండా గ్రహించి, పేడతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు, పసుపు, కుంకుమలతో అలంకరించి వాటిపై గరిక, పిండి పూతలతో అలంకరిస్తారు, వాటిని ముగ్గుల మధ్య ఉంచి బంతి, చేమంతి పువ్వులతో, నవ ధాన్యాలతో, రేగు పండ్లతో, చెరకు ముక్కలతో అలంకరిస్తారు. అది అలంకారమో, నైవేద్యమో గుర్తించలేము, యువతులు ముగ్గులు వేయడం ఈ పండుగకు గల మరో ప్రత్యేకత, ముగ్గును ‘రంగవల్లి’ అంటారు. పితృదేవతలను ఆహ్వానించే కార్యక్రమంలో ముగ్గులు వేయరు, కాని సంక్రాంతి పండుగలో మాత్రం దేవతలకు ఆహ్వానంగా రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఈ సంక్రాంతి ముగ్గులలో
తీగ ముగ్గులు, రథం ముగ్గులు, ఇంధ్రధనుస్సు ముగ్గులు, అక్కర జ్యోతి ముగ్గులు, చెరకుగడ ముగ్గులు, మీనాల ముగ్గులు, శుభలగ్నం ముగ్గులు, స్వయంవరం ముగ్గులు దర్శనమిస్తాయి. ఇంటిల్లిపాదీ పిల్లలనుంచి పెద్దల వరకూ వేడి నీళ్ళతో తలారా స్నానం చేసి ‘భోగి పీడ’ వదిలిందని చెబుతారు. సాయంత్రం వేళ పేరంటాలు జరిపి రేగు పళ్ళు, చెరకు ముక్కలతో చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు, పొంగలి- పులగము ప్రసాదంగా స్వీకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నువ్వుల రొట్టెలు తినడం చూస్తాం
*మకర సంక్రాంతి*
మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశ్యాధిపతి శని, శని వాత ప్రధాన గ్రహమని జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది, వాతం నూనె లాంటి స్నేహ ద్రవ్యాల వల్ల, కూష్మాండం (గుమ్మడికాయ) వంటి కాయల వల్ల తగ్గుతుంది, కాబట్టి ఆ రోజు తెలక పిండి నలుగుతో స్నానం చేసి రాశ్యాధిపతి శని ప్రీతి కోసం నువ్వులు, గ్ముడి కాయలు దానం చేస్తారు. పితృదేవతల పుణ్యలోక ప్రాప్తి కోసం తర్పణ శ్రాద్ధాలను ఆచరిస్తారు, రైతుల గృహాలన్నీ ధాన్యాదులతో కళ కళలాడుతుంటాయి, గృహస్థులు మకర సంక్రాంతి రోజున ఇంటి మధ్య- చుట్టూ నాలుగు పిడతలను, మధ్య లో ఒక పిడత (కుండ) పెట్టి, అందులో కొత్త బియ్యం, పాలు పోసి పొంగే దాకా కింద ఆవు పిడకలతో మండిస్తారు. అలా తయారైన పొంగలిని అందరికీ ప్రసాదంగా పంచుతారు, పాలు పొంగినట్టు సిరి సంపదలు పొంగి పొర్లాలని ధాన్యలక్ష్మిని ప్రార్ధిస్తారు. శ్రీ మహా విష్ణువు ఆది వరాహ రూపంలో ఈ భూమిని పైకి తీసుకువచ్చినది ఈ మకర సంక్రాంతి రోజునే, బలి చక్రవర్తి వామనుడికి మూడు అడుగులు దానం చేసిందీ ఈ రోజుననే ఇంద్రోత్సవాన్ని నిరోధించి నందుకు కోపంగా ఇంద్రుడు రేపల్లెపై వర్షం కురిపిస్తే గోవర్థన నాద్రిని ఎత్తి శ్రీకృష్ణుడు గోపాలురను కాపాడిందీ ఈ రోజే, ఈ రోజు హరి దాసులు ‘హరి లో రంగ హరి’ అంటూ పాడడం చూస్తాం.
*కనుము పండుగ*
మూడవ రోజు పశువులను, బళ్ళను అలంకరించి ‘గో ప్రదక్షిణం’ చేస్తారు, గంగానమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడతారు, ‘కనుము పండుగ నాడు మినుము తినాలి’ అనే సంప్రదాయం ఉంది. ఆ రోజు విచిత్ర వేషాల ప్రద ర్శన చేస్తారు, పౌరాణిక పాత్రలు ధరించి అభినయిస్తూ, గృహ స్థులు సమర్పించే కాను కల్ని కళాకారులు స్వీకరించి దీవిస్తారు. ముక్కనుము, ఈ మూడు రోజుల తర్వాత నాలుగవ రోజు కొత్త పెళ్ళి కూతుళ్ళు సావిత్రీ, గౌరీ వ్రతాలు- బొమ్మల నోము పెడతారు. తొమ్మిదవ రోజు వివిధ నైవేద్యా లతో ఆ దేవిని పూజించి పుణ్య తీర్థాలలో నిమజ్జనం చేస్తారు. ఇలా దాదాపు మూడు రోజు ల పాటు సంతోషాన్ని నింపే ఈ సంక్రాంతి పండుగ ను వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. మకర సంక్రాంతిని పంజాబీ లు ‘లోహడీ’ అనీ బెంగాలీలు ‘తిలప్రా సంక్రాంతి’ అనీ మహారాష్టల్రో ‘తిల సంక్రాంతి ’ అనీ తమిళనాడులో ‘పొంగల్’ అనీ ఉత్తర ప్రదేశ్‌లో ‘బడీ ఈద్’ అనీ, మొక్కుల పండుగ అనీ పిలుస్తారు. ప్రాచీన సంప్రదాయకులైన గ్రీకులు ‘బౌకన్’ అనే దేవత స్మృత్యర్థం సంక్రాంతి పండుగను చేసుకుంటారు. ఈజిప్టు సిద్ధాంత వేత్తలు ఈ మకరరాశికి ‘నమ్’ జలాధి దేవతలకు సంబంధం ఏర్పరచి, సూర్యుని మకర రాశి ప్రవేశానికి- నైలు నది ఉప్పొంగడానికి సంబంధం కలిపారు, ఇలా ప్రపంచ వ్యాప్తమైన ఈ సంక్రాంతి తెలుగు లోగిళ్ళకు ప్రకృతి మాత రూపంలో స్వాగతం పలుకుతుంది.
తెలుగు పండుగల్లో అతి పెద్ద పండుగైన సంక్రాంతిని ఆబాల గోపాలం ఆనందంగా జరుపుకుంటారు. తెలుగు ప్రాంతం కళ కళ లాడే పండుగ సంక్రాంతి...
Comment List