రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న బైక్
On
చుంచుపల్లి (న్యూస్ ఇండియా) ఫిబ్రవరి 27 : మండలం పరిధిలోని విద్యానగర్ పంచాయతీ కొత్తగూడెం -ఖమ్మం ప్రధాన రహదారి పై మంగళవారం జరిగిన రోడ్ ప్రమాదం లో జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామానికి చెందిన గోగుల నర్శింహారావు(28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చుంచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం నుంచి స్వగ్రామం గుండెపూడి కి (TS 28L7399) బైక్ పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ కు తగలడంతో సంఘటన స్థలంలో మృతి చెందాడు. చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Views: 49
Tags: BREAKING NEWS
Comment List