గద్దర్ వారసులు ఎవరు?
గద్దర్ కుటుంబంలో బయటపడ్డ రాజకీయ విభేదాలు.. టికెట్ కోసం వారసుల మధ్య పోటీ
ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబంలో విభేదాలు రాజకీయంగా బయటపడ్డాయి. కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించిన గద్దర్ కొడుకు సూర్యంకు సొంత కుటుంబం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకీ గద్దర్ కుటుంబం ఏం జరుగుతుంది..?
గద్దర్ చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల విభేదాలు బయటకు వచ్చాయి. గద్దర్ కొడుకు సూర్యంకు 2018 లోని పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని భావించారు. కానీ ఆయన పోటీకి వెనక్కి తగ్గడంతో టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గద్దర్‌కు కొత్త సంబంధాలు ఏర్పాటులో ఈసారి పోటీ చేస్తారని భావించారు. కానీ గద్దర్ అకాల మరణం తర్వాత గద్దర్ కొడుకు సూర్యంకు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా గద్దర్ కూతురు వెన్నెల ప్రెస్ మీట్ పెట్టి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
దీంతో గద్దర్ ప్రజా పార్టీ వారసులు ఎవరన్న చర్చ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందన్న చర్చ ప్రారంభం అయింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు ఒకసారి గా బయటకు వచ్చాయి. ఇంతకీ గద్దరు వారుసులు ఇద్దరిలో రాజకీయ వారసులు ఎవరో, కాంగ్రెస్ పార్టీ గద్దర్ కొడుకు సూర్యంకు.. కూతురు వెన్నెలకి టికెట్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.
Comment List