వాట్సాప్ గ్రూప్ లలో అసత్య ప్రచారాలు చేయొద్దు: ఎస్సై పెండ్యాల ప్రభాకర్

గ్రూప్ అడ్మిన్ లదే పూర్తి బాధ్యత

వాట్సాప్ గ్రూప్ లలో అసత్య ప్రచారాలు చేయొద్దు: ఎస్సై పెండ్యాల ప్రభాకర్

సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకి ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ అడ్మిన్స్ కి ముఖ్య సూచన ఏమనగా గ్రూపులలో ఇతరుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వలిగొండ మండల ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసత్య విషయాలు ప్రచారం చేసే విధంగా సందేశాలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నట్లయితే గ్రామాల్లో ఉన్న ప్రశాంతత వాతావరణం చెడగొట్టేలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చే విధంగా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును అన్నారు అలాంటి మెసేజ్లు షేర్ చేయడం క్రియేట్ చేయడం ఎడిట్ చేయడం విషయాల పట్ల గ్రూప్ అడ్మిన్స్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని రానున్న రోజుల్లో ఎన్నికల సమయం కాబట్టి గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం చెడగొట్టకూడదని తదుపరి పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని

Screenshot_20231013_120338~2
వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్

ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Views: 224
Tags:

Post Comment

Comment List