విద్యుత్ ఘాతానికి గురై వ్యక్తి మృతి
On
విద్యుత్ ఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే పోలీసుల కథనం ప్రకారం వలిగొండ మండలంలోని (ఎం) తుర్కపల్లి గ్రామంలో మర్రి రోశయ్య ( 43) ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మరణించడం జరిగింది. మృతుడు వారి ఇంటి పైకి కోతులు రావడంతో వర్షంతో తడిసి ఉన్న కర్రను తీసుకొని వాటిని తరమడానికి వెళ్లి ప్రమాదవశాత్తు 11 కేవీ వైరును తాకడంతో విద్యుత్ ఖాతానికి గురై మరణించడం జరిగింది. మృతుని భార్య మర్రి పార్వతమ్మ ఫిర్యాదు మేరకుదీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని దర్యాప్తు జరుపుతున్నామని వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలియజేశారు.
Views: 1017
Tags:
Comment List